ఏర్పాట్లను ప‌రిశీలించిన ఎస్పీ, సీవో

Spread the loveపంచ‌మి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వహించే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. పుణ్య స్నానం చేయ‌నున్నారు. దీంతో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఎస్వో, ఎస్పీలు ప‌రిశీలించారు.భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం, పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు…

newsseals-Panchamiteerathaam
Spread the love

పంచ‌మి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ

తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి బ్ర‌హ్మోత్స‌వాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా నిర్వహించే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రానున్నారు. పుణ్య స్నానం చేయ‌నున్నారు. దీంతో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఎస్వో, ఎస్పీలు ప‌రిశీలించారు.
భద్రతా పరంగా దొంగతనాలు జరగకుండా ప్రత్యేక క్రైమ్ టీంలను నియమించడం, పాత నేరస్తులను గుర్తించేందుకు ఆధునిక పరికరాలను వినియోగించడం ద్వారా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి, భక్తుల వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల హోల్డింగ్ పాయింట్ల నుండి పుష్కరిణి వరకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లను పరిశీలిస్తూ, క్యూ పాయింట్ల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచనలు జారీ చేశారు.

పంచమి తీర్థం పుణ్య ఘడియలు ఆ రోజంతా కొనసాగనున్నందున భక్తులు ఆత్రుత చెందకుండా, పోలీసులకు సహకరిస్తూ నెమ్మదిగా పుణ్యస్నానం ఆచరించాలని భక్తులందరికీ కడపటి భక్తుడు వరకు కూడా పుణ్యస్నానం ఆచరించే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేశామని, ఇంకా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

25న జ‌రిగే పంచ‌మి తీర్థం కోసం పెద్ద ఎత్తున వాహ‌నాలు రానున్నాయ‌ని తెలిపారు. వడమాలపేట , అప్పలయగుంట వైపు నుండి తిరుచానూరు/ తిరుపతి వైపు వచ్చే వాహనాలు పూడి రైల్వే గేటు–ఆర్‌సి పురం–తిరుచానూరు మార్గం గుండా తిరుపతి వైపు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే పుత్తూరు, శ్రీ కాళహస్తి వైపు నుండి తిరుపతి చేరుకునే వాహనాలు గాజులమండ్యం సర్కిల్–ఓల్డ్ రేణిగుంట రోడ్–రేణిగుంట టౌన్–ఆటో నగర్–బ్లిస్ హోటల్ మార్గం ద్వారా తిరుపతి వైపు వెళ్లాలని సూచించారు.

తిరుపతి టౌన్ నుండి తిరుచానూరుకు వెళ్లే ఆర్‌టీసీ టౌన్ సర్వీసులు, ప్రైవేట్ బస్సులు తిరుపతి–మ్యాంగో యార్డ్–తనపల్లి క్రాస్–సిఎస్ కళ్యాణమండపం–సర్వీస్ రోడ్–ఒరియన్ హోటల్–తాటి బెల్లం హోటల్–మ్యాంగో మార్కెట్ యార్డ్ మార్గం గుండా తిరిగి తిరుపతి వైపు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుందని తెలిపారు. చిత్తూరు వైపు నుండి తిరుపతి చేరుకునే ఆర్‌టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఒమేగా హాస్పిటల్–చెర్లపల్లి జంక్షన్ మార్గం ద్వారా తిరుపతి వైపు ప్రవేశించాలి. తిరుపతి నుండి తిరుచానూరుకు వెళ్లే ద్విచక్ర వాహనాలు శిల్పారామం వద్ద పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

కార్లు మరియు ఇతర వాహనాలు మ్యాంగో మార్కెట్ యార్డ్ పార్కింగ్ ప్రాంతాన్ని వినియోగించాల్సి ఉంటుంది. శ్రీ పద్మావతి అమ్మవారి పడి వాహనాలు మాత్రమే తనపల్లి క్రాస్–సింధు ఫ్లైఓవర్–వార్తక్రాస్–రంగనాధం వీధి మార్గం ద్వారా అమ్మవారి ఆలయానికి అనుమతించ బడతాయని తెలిపారు ఎస్పీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports