టీటీడీ దేవాల‌యాల్లో అన్న‌దానం చేప‌ట్టాలి

ఈవో, చైర్మ‌న్ ను ఆదేశించిన ఏపీ సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలోని అన్ని దేవాల‌యాల‌లో విధిగా అన్న‌దానం చేప‌ట్టేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఆదేశించారు. ఏ ఒక్క భ‌క్తుడు ఇబ్బంది ప‌డ కూడ‌ద‌న్నారు. దేవాదాయ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల ప్రొక్యూర్మెంట్‌లో తీసుకు వచ్చిన మార్పులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. ఈ సమీక్షకు దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల తాము కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని తెలిపారు ఈవో. ప్ర‌తి రోజూ స్వామి వారిని ద‌ర్శించు కునేందుకు వ‌చ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి స‌దు పాయాలు క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

  • Related Posts

    టీటీడీ టికెట్ల స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి

    తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెలా జారీ చేసే టికెట్ల ద‌ర్శ‌నం బుకింగ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీటీడీ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు…

    డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

    డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *