పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the loveజెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది అమ‌రావ‌తి : జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌కాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడిని ఓడించారని అన్నారు. మునుపటి తరంతో పోల్చుకుంటే జెన్ జి యువత చాలా భిన్నం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే కుదరదు.…

newsseals-PawanKalyan
Spread the love

జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది

అమ‌రావ‌తి : జెన్ జి తో యువ‌త ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చిందని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అబద్దపు హామీలుతో ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌కాలం మోసం చేయలేమన్నారు బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడిని ఓడించారని అన్నారు. మునుపటి తరంతో పోల్చుకుంటే జెన్ జి యువత చాలా భిన్నం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే కుదరదు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించాలి, అంతే కాదు ఉపాధి కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగైతేనే నిజమైన అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పారు డిప్యూటీ సీఎం. ఎక్కువ శాతం ప్రజలు సంక్షేమం అవసరం లేని పరిస్థితిలో ఉండాలి. వాళ్ల స్వయం శక్తి మీద నిలబడే పాలసీలు తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. నిధులు లేకపోయినా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నాం అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌.

ఆరు నూరైనా స‌రే అష్ట క‌ష్టాలు ప‌డి పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం అన్నారు. సగటు మనిషి కోరుకుంటున్న అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తున్నాం అని చెప్పారు. సంపద సృష్టించ గలిగితే రాష్ట్రం నుంచి వలసలు వెళ్లే అవసరం ఉండద‌న్నారు. నేను కోరుకుంటున్నది స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం కావాలి. ఎవరికి తలవంచని యువ భారతం కోరుకుంటున్నానని అన్నారు. పర్యాక ప‌రంగా చూస్తే కోనసీమ కేరళ స్థాయికి ఉన్న‌ శక్తి, సత్తా ఉంద‌న్నారు డిప్యూటీ సీఎం. ఇక్కడ బ్యాక్ వాటర్ తో కేరళ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చన్నారు. మన దర్శక, నిర్మాతలు షూటింగులకు ఎక్కడో తమిళనాడు, కేరళకు వెళ్తుంటారని, కోనసీమ అందాలు అంతకు మించి ఉంటాయన్నారు. ఈ అందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. ఇక్కడి యువతలో ఎంతో తెగింపు ఉంటుందన్నారు. వీటన్నింటిని సరైన మార్గంలో పెడితే వేలాది మందికి ఉపాధి కల్పించ వ‌చ్చ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports