శ్రీ‌వారి ఆల‌యంలో ఘ‌నంగా కార్తీక దీపోత్సవం

క‌న్నుల పండువ‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మం

తిరుమల : తిరుమల శ్రీవారి అలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.

ఆ తర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు.

ఈ కార్తీక దీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకి దేవి, భాను ప్రకాష్ రెడ్డి, నరేష్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

  • Related Posts

    టీటీడీ టికెట్ల స్కాంపై విచార‌ణ జ‌రిపించాలి

    తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి నెలా జారీ చేసే టికెట్ల ద‌ర్శ‌నం బుకింగ్ కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా టీటీడీ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇందుకు…

    డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

    డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *