నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిసిన జ‌న‌సేన ఎంపీ

Spread the love

మామిడి జెల్లీపై జీఎస్టీ త‌గ్గింపుపై ధ‌న్య‌వాదాలు

ఢిల్లీ : జ‌న‌సేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీ‌నివాస్ తంగెళ్ల మ‌ర్యాద పూర్వ‌కంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ను క‌లిశారు. ఈ సంద‌ర్బంగా మామిడి జెల్లీపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కాకినాడ ప్రాంతంలోని గ్రామీణ కార్మికులకు గణనీయమైన ఉపశమనం కలిగించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా కాకినాడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో, మామిడి జెల్లీ (మామిడి తాండ్ర) ఉత్పత్తి చాలా ప్రజాదరణ పొందిందని అన్నారు. జీవనోపాధికి కీలకమైన వనరుగా పని చేస్తున్న‌ద‌ని తెలిపారు. 400 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న ఈ పరిశ్రమ 15,000 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంద‌ని చెప్పారు. వీరిలో ఎక్కువ మంది గ్రామీణ మహిళలు ప‌ని చేస్తున్నార‌ని తెలిపారు.

త‌మ‌ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు తాను స్వ‌యంగా మామిడి జెల్లీ యూనిట్లను స్వయంగా తనిఖీ చేశానని చెప్పారు. కార్మికులతో సంభాషించాను, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ను పదేపదే కలిశానన‌ని చెప్పారు. GST తగ్గింపును అభ్యర్థించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ సాంప్రదాయ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తూ ఫిబ్రవరి , ఆగస్టులలో నేను వివరణాత్మక ప్రాతినిధ్యాలను కూడా సమర్పించిన‌ట్లు తెలిపారు ఎంపీ.

  • Related Posts

    బాస‌ర స‌రస్వ‌తి ఆల‌య అభివృద్దిపై ఫోక‌స్

    Spread the love

    Spread the loveఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మ‌రింత అందంగా, స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చి దిద్దేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. శ‌నివారం హైద‌రాబాద్ లో…

    ఎన్జీటీ డిస్పోజ‌ల్ చేసింది కానీ డిస్మిస్ చేయ‌లేదు

    Spread the love

    Spread the loveమూసీ ప్రాజెక్టుపై కేసు కొన‌సాగుతుందన్న కార్తీక్ రెడ్డి హైద‌రాబాద్ : బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా కాంగ్రెస్ స‌ర్కార్ త‌ల‌పెట్టిన మూసీ పున‌ర్ నిర్మాణం పేరుతో చేప‌ట్టిన ప్రాజెక్టుపై తాను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *