న‌ల్ల‌గొండ అభివృద్ది కోసం కృషి చేస్తా : కోమటిరెడ్డి

Spread the loveకాంగ్రెస్ ను గెలిపిస్తే మ‌రిన్ని నిధులు మంజూరున‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ న‌గ‌రం అభివృద్ది కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇవాళ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ సంద‌ర్బంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు మంత్రి.…

newssealss-KomatireddyVenkatReddy
Spread the love

కాంగ్రెస్ ను గెలిపిస్తే మ‌రిన్ని నిధులు మంజూరు
న‌ల్ల‌గొండ జిల్లా : న‌ల్ల‌గొండ న‌గ‌రం అభివృద్ది కోసం శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇవాళ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. ఈ సంద‌ర్బంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు మంత్రి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత‌నే పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం అయ్యాయ‌ని చెప్పారు కోమ‌ట‌రెడ్డి వెంక‌ట్ రెడ్డి. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు. నల్లగొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్పు చేశామ‌ని చెప్పారు. ఎక్క‌డా లేని రీతిలో భారీ ఎత్తున నిధుల‌ను న‌గ‌రాభివృద్ది కోసం ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, 24 గంటల తాగునీరు, రూ.700 కోట్ల బైపాస్ రోడ్డు వంటి పనులతో నల్లగొండను మహానగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నాం అని తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో పాటు అన్ని డివిజన్లలో పార్టీ అభ్యర్థులను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించాలని కోరారు కోమ‌టిరెడ్డి శ్రీ‌నివాస్ ర‌డ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports