రేడియేష‌న్ టెక్నాల‌జీ ద్వారా రోడ్ల మ‌ర‌మ్మ‌త్తులు

Spread the loveప్ర‌శంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ‌య‌వాడ : బెజ‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్‌హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా నగరంలోని ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందితోనే అతి తక్కువ సమయంలో గోతులను పూడ్చవచ్చని, ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేకుండా…

newsseals-MPChinni
Spread the love

ప్ర‌శంసించిన టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ : బెజ‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌క్యాప్ (ENCAP) ద్వారా రూ.1.48 కోట్ల విలువైన అత్యాధునిక పాత్‌హోల్ రిపేర్ మిషన్ వీఎంసీకి ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా నగరంలోని ఎక్కడైనా గుంతలు ఏర్పడితే, కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బందితోనే అతి తక్కువ సమయంలో గోతులను పూడ్చవచ్చని, ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేకుండా రోడ్ల మరమ్మత్తులు చేయవచ్చని వివరించారు.

ఈ విధానం పూర్తిగా నూతనమైన మార్పులకు నిదర్శనమని, గ్రీన్ టెక్నాలజీ ద్వారా నగరాల్లో కాలుష్యాన్ని నియంత్రించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇలాంటి ఆధునిక యంత్రాలు మరిన్ని వీఎంసీకి రాబోతున్నాయని, భవిష్యత్తులో విజయవాడలో చిన్న గుంత పడినా 15 నిమిషాల్లోనే మరమ్మత్తు జరిగేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్లు దేవినేని అప‌ర్ణ‌, చెన్నుపాటి ఉషారాణి, ముమ్మ‌నేని ప్రసాద్, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు ప‌రుచూరి ప్ర‌సాద్, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చ‌ర‌ణ్ సాయి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ (ప్రాజెక్ట్) డాక్ట‌ర్ డి.చంద్ర‌శేఖ‌ర్, చీఫ్ ఇంజ‌నీర్ ఇంచార్జ్ పి.స‌త్య‌కుమారి, సూప‌రిండెంటింగ్ ఇంజ‌నీర్ (వ‌ర్క్స్) వి.చంద్ర‌శేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ జి.సామ్రాజ్యం, డిప్యూటీ ఇంజ‌నీర్లు, అసిస్టెంట్ ఇంజ‌నీర్లు ల‌తో పాటు ఎన్.డి.యే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports