రైతుల‌కు నిరంత‌రాయంగా ఉచిత విద్యుత్

Spread the loveఇస్తున్నామ‌న్న మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న స‌భ‌లో ఆయ‌న రైతుల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ గురించి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా అందించడం జ‌రుగు తోంద‌న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం…

newsseals-APFaarmers
Spread the love

ఇస్తున్నామ‌న్న మంత్రి అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న స‌భ‌లో ఆయ‌న రైతుల‌కు అందిస్తున్న ఉచిత విద్యుత్ గురించి వెల్ల‌డించారు. రాష్ట్రంలో 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రోజుకు 9 గంటలపాటు నిరంతర పగటి ఉచిత విద్యుత్ సరఫరా అందించడం జ‌రుగు తోంద‌న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (31 డిసెంబర్ 2025 నాటికి) ఈ పథకానికి 13,241.17 కోట్ల రూపాయల సబ్సిడీ వ్యయం జరిగిందని తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ ఉద్యాన నర్సరీలు, చెరకు రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తున్నామ‌న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 68,988 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామ‌న్నారు. 2026–27 సంవత్సరానికి విద్యుత్ సబ్సిడీ అవసరాలకు మొత్తం 13,722 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.

ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 31.21లక్షల హెక్టార్లు కాగా, 2025 ఖరీఫ్ లో33.03లక్షలఎకరాలలో పంట సాగు చేయబడినది. (106 %) రభీ సాధారణ విస్తీర్ణం 20.69లక్షల హెక్టార్లు కాగా, 2025 ఖరీఫ్ లో22.80లక్షల హెక్టార్లలో పంట సాగు చేశార‌ని తెలిపారు అచ్చెన్నాయుడు. (110 %) భారతదేశం యొక్క వ్యవసాయం వృద్ధి రేటు 0.39% కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన, వ్యవసాయ వృద్ధి రేటు 7.83శాతంగా నమోదయిందని తెలిపారు. దేశ వ్యవసాయరంగ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా 10%. వ్యవసాయంలో డిజిటలైజేషన్ వినియోగం , ఈ-పంట నమోదును సమర్ధవంతంగా వినియోగిస్తూ వ్యవసాయంలో అన్ని పథకాలను అనుసంధానం చేశామ‌న్నారు అచ్చెన్నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports