ఏపీలో 1,404 మ‌ట్టి ప‌రీక్ష కేంద్రాల ఏర్పాటు

Spread the loveవెల్ల‌డించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ చెల్లించామని అన్నారు. ల్యాబ్లు పని చేయ కపోవడం ప్రతి గ్రామంలో మట్టి నమూనాల విశ్లేషణ కొరకు జిల్లా , మండల స్థాయిలో 1,404 మట్టి పరీక్ష కేంద్రాలు (STL) ఏర్పాటు చేశామ‌న్నారు. వైసీపీ హయాంలో సరిపడా నిధుల కేటాయింపు లేక…

newsseals-APSTL
Spread the love

వెల్ల‌డించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ చెల్లించామని అన్నారు. ల్యాబ్లు పని చేయ కపోవడం ప్రతి గ్రామంలో మట్టి నమూనాల విశ్లేషణ కొరకు జిల్లా , మండల స్థాయిలో 1,404 మట్టి పరీక్ష కేంద్రాలు (STL) ఏర్పాటు చేశామ‌న్నారు. వైసీపీ హయాంలో సరిపడా నిధుల కేటాయింపు లేక పోవడం, ల్యాబ్‌లలో సిబ్బంది కొరత, సరైన పరికరాలను అందుబాటులో ఉంచక పోవటం వలన, ప్రస్తుతం కేవలం 29 మట్టి పరీక్ష కేంద్రాలు మాత్రమే పని చేస్తున్నాయని చెప్పారు. మిగిలిన 1,375 ల్యాబ్లు మూడు సంవత్సరాల (2020-21 నుండి 2022-23) పాటు పని చేయలేదని ఆరోపించారు.

మట్టి నమూనాల విశ్లేషణ సక్రమంగా జరగక పోవటం వలన రైతులు సమగ్ర, శాస్త్రీయ పద్ధతుల్లో పంటల కోసం కావాల్సిన సూచనలను పొందలేక పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అచ్చెన్నాయుడు. దీంతో ఉత్పత్తి తగ్గిపోయిందని అన్నారు. వీటిని ప్రస్తుతం మరలా ఉపయోగంలోకి తీసుకు వస్తున్నామని చెప్పారు అచ్చెన్నాయుడు. ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు 2026-27లో 4.66 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. సూక్ష్మ పోషకాల సరఫరా తెదేపా హయాంలో 100 శాతం సబ్సిడీతో 2014 నుండి 2018 మధ్యకాలంలో 25.75 లక్షల మంది రైతులకు రూ.280.79 కోట్లు ఖర్చుచేసి 3 లక్షల మెట్రిక్ టన్నుల జింక్, బొరాక్స్, జిప్సం మొదలగు సూక్ష్మపోషకాలను పంపిణీ చేశామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports