జ‌ర్న‌లిస్ట్స్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ డైరీ ఆవిష్క‌ర‌ణ‌

Spread the loveవిడుద‌ల చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు.1960లో స్థాపించబడిన ఈ చారిత్రాత్మక సొసైటీ తరఫున సభ్యుల వివరాలు, కాలనీల చరిత్ర, మీడియా సంబంధిత సమాచారంతో కూడిన డైరీని మొదటిసారిగా రూపొందించామని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండబేరి గోపరాజు మంత్రికి…

Spread the love

విడుద‌ల చేసిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (JCHSL) రూపొందించిన 2026 డైరీని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు.1960లో స్థాపించబడిన ఈ చారిత్రాత్మక సొసైటీ తరఫున సభ్యుల వివరాలు, కాలనీల చరిత్ర, మీడియా సంబంధిత సమాచారంతో కూడిన డైరీని మొదటిసారిగా రూపొందించామని సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండబేరి గోపరాజు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాలతో సత్కరించగా, మంత్రి సొసైటీకి, సభ్యులకు అభినందనలు తెలిపారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి జ‌ర్న‌లిస్టుల‌తో చాలా సేపు చ‌ర్చించారు. వివిధ స‌మ‌స్య‌ల గురించి ఆరా తీశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే అంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మిక్కిలినేని రవీంద్రబాబు, వైస్ ప్రెసిడెంట్ మసాదే లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ డా. చల్లా భాగ్యలక్ష్మి, ట్రెజరర్ భీమగాని మహేష్, డైరెక్టర్లు డి. కమలాకరాచార్య , ఎం.ఎస్.హెచ్. హాష్మీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports