కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Spread the loveఅనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి తీరుతామ‌న్నారు. ఉక్కు పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం న్నారు సీఎం చంద్రబాబు . దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం…

newsseals-APCM
Spread the love

అనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి తీరుతామ‌న్నారు. ఉక్కు పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం న్నారు సీఎం చంద్రబాబు . దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం రాష్ట్రంలో ఉంద‌న్నారు. నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతం అన్నారు. టూరిజం నుంచి డేటా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

పారిశ్రామిక‌వేత్త‌లు కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోందన్నారు. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు సీఎం. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports