కీలక ప్రకటన చేసిన సంజు శాంసన్
చెన్నై : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంనన్ ఇప్పుడు సంచలనంగా మారాడు. తాజాగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో టాప్ లో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడి 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఆ తర్వాత తనను భారీ ధర రూ. 18 కోట్లు పట్టి చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ లో రాణిస్తాడని అనుకున్నారంతా. కానీ ఎవరూ ఊహించని రీతిలో తను మూడు మ్యాచ్ లు ఆడితే కేవలం 9, 6, 7 పరుగులు మాత్రమే. ఇక ప్రతి ఒక్కరూ శాంసన్ ను విమర్శించడం మొదలు పెట్టారు. అయినా తమిళ తంబిలు తనను మరింతగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
ప్రధానంగా చెప్పుకోవాల్సింది చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. తనపై పూర్తి నమ్మకం ఉంచాడు. ఆపై ఇప్పటి వరకు సీఎస్కేకు పలుమార్లు ఛాంపియన్ గా నిలిపిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం సంజు శాంసన్ కు పూర్తి సపోర్ట్ ఇచ్చాడు. తన తర్వాత శాంసన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ఈ తరుణంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన కీలక కీలక లీగ్ మ్యాచ్ లో సంజు శాంసన్ దుమ్ము రేపాడు. ఐపీఎల్ సీజన్ లో తొలి సెంచరీ చేశాడు. ఏ ఆటగాడు ఇప్పటి వరకు శతకం బాదలేదు. మ్యాచ్ అనంతరం శాంసన్ మాట్లాడుతూ ఈ శతకం ప్రత్యేకమైనదని, దీనిని కోచ్ ఫ్లెమింగ్ కు అంకితం చేస్తున్నట్లు చెప్పాడు.








