కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
అమరావతి : ఏపీని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఆలయాల అభివృద్ది, వసతి కల్పనకు సంబంధించి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ లను రూపొందించచాలని ఆదేశించారు ఉన్నతాధికారులను. ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. . అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలని పేర్కొన్నారు సీఎం. ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి జరిగేలా చూడాలని , త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దీని కోసం టెంపుల్ టౌన్ డెవలప్‌మెంట్ ప్లాన్ సిద్దం చేయాలని అన్నారు సీఎం. భక్తుల రద్దీ నియంత్రణ విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. కేవలం భద్రత ఆధారంగా కాకుండా సంప్రదాయం ప్రకారం దేవాలయాల్లో నిబంధనలు ఉండాలని స్పష్టం చేశారు. దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించాలన్నారు. దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కన్నారు. ఈవోలు బదిలీపై వెళ్లే సమయంలో కొత్తగా వచ్చే అధికారులకు ముఖ్యమైన వివరాలను అందించి వెళ్లాలన్నారు. ఈ సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





