మే 10న ప్ర‌ధాని మోదీ హైద‌రాబాద్ కు రాక‌

VijayaBhaskar · April 30, 2026
Spread the love

భారీ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్న బీజేపీ చీఫ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 10వ తేదీన దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద‌ర్ రావు. ఆయ‌న కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డితో క‌లిసి మాట్లాడారు మీడియాతో. మోదీహైదరాబాద్ పర్యటన నేపథ్యంలో నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ సందర్భంగా తోటి ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటన ఏర్పాట్లు , కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. మోదీ పర్యటనను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

పార్టీకి చెందిన బాధ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల‌తో పాటు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున మోదీ ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు. కేంద్ర మంత్రితో పాటు పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి , జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ ల‌క్ష్మ‌ణ్‌,
ర‌ఘునంద‌న్ రావు, ద‌ర్మ‌పురి అర్వింద్, ఈట‌ల రాజేంద‌ర్ , డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి, శాస‌న మండ‌లి ప‌క్ష నేత‌లు మ‌హేశ్వ‌ర్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ధ‌న్ పాల్ సురాన‌, అంజిరెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.