ఇది ఊహించ‌ని ప‌రాజ‌యం : శ్రేయ‌స్ అయ్య‌ర్

ముమ్మాటికీ ఇది మా బౌల‌ర్ల వైఫ‌ల్య‌మేన‌న్న కెప్టెన్

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ అనూహ్యంగా ఓట‌మి పాలైంది. భారీ తేడాతో ప‌రాజ‌యం కావ‌డంతో ప్లే ఆఫ్స్ రేస్ మ‌రింత క్లిష్ట‌త‌రంగా మారింది. ఈ త‌రుణంలో ఇప్పుడు ఆడాల్సిన అన్ని మ్యాచ్ లు గెలుపొందాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ముందుగా బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ భారీ జ‌ట్టు స్కోర్ సాధించింది. మ్యాచ్ అనంత‌రం మీడియాతో మాట్లాడారు పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్. నిజం చెప్పాలంటే, నేను చాలా నిరాశ చెందాను, ముఖ్యంగా మా ఫీల్డింగ్ విషయంలో. దాని గురించి నేను చాలా అసంతృప్తిగా ఉన్నానని అన్నాడు కెప్టెన్.

ఈ పిచ్‌పై, మనం క్యాచ్‌లు జార విడవక పోతే ఇన్ని పరుగులు చేయడం సాధ్యం కాదన్నాడు శ్రేయ‌స్ అయ్య‌ర్. కానీ మనం ఇలాంటి సులభమైన అవకాశాలను వదిలేస్తూ ఉంటే, మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టమవుతుంద‌ని హెచ్చ‌రించాడు. మనం ఇలాంటి సులభమైన క్యాచ్‌లను వదిలేస్తూ ఉంటే, ఏ కెప్టెన్, బ్యాట్స్‌మెన్, లేదా బౌలర్ కూడా ఏమీ చేయలేర‌న్నాడు. ఒక క్యాచ్ వదిలేయడం అర్థం చేసుకోదగినదే, కానీ ఒక మ్యాచ్‌లో మూడు క్యాచ్‌లు లేదా స్టంపింగ్‌లు వదిలేస్తే, మనం ఎప్పటికీ బాగా రాణించలేమ‌న్నాడు. కాబట్టి ఈ తప్పులను సరిదిద్దుకుని, రాబోయే మ్యాచ్‌లలో మెరుగు పడటంపై మా దృష్టి ఉంటుందన్నాడు అయ్య‌ర్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *