newsseals.com
SPORTS

ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

VijayaBhaskar May 8, 2026
newssseals-RshabhPant
Spread the love

ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌లేం

ల‌క్నో : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు 6 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది. దీంతో 9 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న ఆర్సీబీకి ఇది బిగ్ షాక్ ఇచ్చింది. ఇక ల‌క్నో జ‌ట్టుకు వ‌రుస‌గా ఆరు మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది. ఈ ఒక్క విజ‌యం కాస్తా ఊర‌ట‌నిచ్చింది.

మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ రిష‌బ్ పంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సీజన్‌లో టాప్ 4 కు అర్హత సాధించే అవకాశం మాకు ఇక లేదని వాపోయాడు. వచ్చే సీజన్‌లో మరింత మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం అని చెప్పాడు. మరింత స్పష్టతతో క్రికెట్ ఆడతాం అన్నాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్‌కు అర్హత సాధించడానికి ఇంకా అవకాశం ఉన్నప్పటికీ, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు ఇలాంటి పరిస్థితుల నుంచే చాలాసార్లు అర్హత సాధించాయి. కానీ ఇక్కడ, కెప్టెన్ ఇప్పుడే చేతులెత్తేస్తున్నాడు. నిజం చెప్పాలంటే, ఈ వ్యాఖ్యలు రిషబ్ పంత్ నిజంగా మంచి కెప్టెన్ కాదని స్పష్టం చేస్తున్నాయి.