Friday, 16 October 2026

టి20 జ‌ట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?

newsseals-SanjuSamson

కెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ కంటిన్యూ

ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జ‌ట్టును ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. త‌న సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ఇటీవ‌లే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకుంది. ఈ టోర్నీలో అన్నీ తానై ముందుండి కీల‌క‌మైన పాత్ర పోషించారు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. ఇదే స‌మ‌యంలో అంద‌రి క‌ళ్లు టి20 జ‌ట్టుకు ఎవ‌రు సార‌థ్యం వ‌హిస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ త‌రుణంలో గ‌త కొంత కాలంగా పేల‌వ‌మైన ఫామ్ లేమితో నానా తంటాలు ప‌డుతున్నాడు సూర్య కుమార్ యాద‌వ్.

ఇదే క్ర‌మంలో ప‌లుమార్లు సూర్య భాయ్ ని కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. కానీ మ‌రో స‌మాచారం ఏమిటంటే త‌న‌కు బ‌దులు సంజు శాంస‌న్ ను ఛాన్స్ ఇస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. BCCIకి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, ప్రపంచ కప్‌లో సంజు శాంసన్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని, అతన్ని భారత T20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలెక్టర్లు యోచిస్తున్నారు. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల సూర్యకుమార్ యాదవ్ రాబోయే ఐర్లాండ్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే, అతని స్థానంలో సంజు శాంసన్ భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *