newsseals.com
SPORTS

అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

VijayaBhaskar May 14, 2026
newsseals-AngkrishRaghuuvamsshi
Spread the love

46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 ర‌న్స్

రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో యంగ్ క్రికెట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ, చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన కార్తీక్ శ‌ర్మ‌, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చెందిన అంగ్ క్రిష్ ర‌ఘువంశీ దుమ్ము రేపుతున్నారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటుతున్నారు. తాజాగా రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు ముంబైకి చెందిన యువ కెర‌టం అంగ్ క్రిష్ ర‌ఘువంశీ. త‌ను క‌ళ్లు చెదిరేలా షాట్స్ ఆడాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ప్ర‌తీ మ్యాచ్ లో గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేస్తూ వ‌చ్చాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా బ్యాటింగ్ చేసింది కోల్ క‌తా. అంగ్ క్రిష్ రఘువంశీ సూప‌ర్ గా ఆడాడు. త‌ను 46 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సుల‌తో 71 ర‌న్స్ చేశాడు. త‌న‌కు తోడుగా క్యామ‌రాన్ గ్రీన్ , రింకూ సింగ్ నిలిచారు. రింకూ 29 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సుల‌తో 49 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్ల‌లో 193 ర‌న్స్ చేసింది. అనంతరం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 19.1 ఓవ‌ర్ల‌లో పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ కేవ‌లం 60 బంతులు ఆడి 11 ఫోర్లు 3 సిక్సుల‌తో 105 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు.