తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

Spread the loveస్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌ హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఫిల్మ్ చాంబ‌ర్ తీసుకునే నిర్ణ‌యాలు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు నాగార్జున యజమాని. ప్రొడ్యూసర్స్ గిల్డ్ , తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య…

newsseals-NagarjunaAkkineni
Spread the love

స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌

హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఫిల్మ్ చాంబ‌ర్ తీసుకునే నిర్ణ‌యాలు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు నాగార్జున యజమాని. ప్రొడ్యూసర్స్ గిల్డ్ , తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇందుకు గాను నాగార్జున త‌ర‌పున అన్న‌పూర్ణ స్టూడియోస్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

అన్నపూర్ణ స్టూడియోస్ చిత్ర పరిశ్రమ ప్రయోజనాలకు గట్టిగా కట్టుబడి ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నిర్ణయాలకు కట్టుబడి, దాని మార్గదర్శకాలను పాటిస్తుందని స్పష్టం చేయాలని అనుకుంటోంది. ఇది సంవత్సరాలుగా మా స్థిరమైన ఆచరణ, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుంది. ఇక నాగార్జున‌ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు యజమాని. ఆయన మేనకోడలు సుప్రియా యార్లగడ్డ, స్టూడియోలోని పలు కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో కూడా చురుకైన సభ్యురాలిగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports