మహమ్మద్ అజారుద్దీన్ షాకింగ్ కామెంట్స్
వివిధ ఫార్మాట్లలో గిల్ లేక పోవడంపై ఫైర్
హైదరాబాద్ : భారత మాజీ కెప్టెన్ , రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ వివిధ ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ లేక పోవడంపై, అలాగే టెస్ట్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ , ఆకిబ్ నబీ ఎంపిక కాకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. టెస్టులు, వన్డేలలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్, కెప్టెన్సీ బాధ్యతలను “చాలా బాగా” నిర్వహించారని, ఏ ఫార్మాట్ నుండీ అతన్ని తప్పించి ఉండకూడదని అజారుద్దీన్ అన్నారు. టి20లలో భారత వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన T20 ప్రపంచ కప్‌కు ముందు జట్టు నుండి తొలగించబడ్డాడు. గిల్ (కెప్టెన్సీ బాధ్యతను) చాలా బాగా నిర్వహిస్తున్నాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా చాలా మెరుగు పడింది.
అతను అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. T20ల కోసం అతన్ని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు అని పేర్కొన్నాడు అజారుద్దీన్ .దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ , నబీ ప్రదర్శనలకు తగిన గుర్తింపు లభించలేదని అన్నాడు. ఆకిబ్ నబీ గొప్ప రెడ్-బాల్ బౌలర్. అతను స్వింగ్ బౌలింగ్‌లో చాలా నైపుణ్యం కలిగిన వాడు. అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. గత రెండేళ్లుగా వికెట్లు తీస్తున్నప్పటికీ , నబీకి టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఇది చాలా నిరాశాజనకం అని అజార్ అన్నారు.