వైభ‌వ్ సూర్య‌వంశీపై అశ్విన్ షాకింగ్ కామెంట్స్


త‌న‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమ్ ఇండియా ఐర్లాండ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇందులో భాగంగా 2 టి0 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. తొలి మ్యాచ్ లో భార‌త్ 34 ర‌న్స్ తేడాతో ఓడి పోయింది. అభిషేక్ శ‌ర్మ ఒక్క‌డే బాగా ఆడాడు. మిగ‌తా వారంతా ఆశించిన స్తాయిలో ఆడ‌లేక పోయారు. దీంతో వైభ‌వ్ సూర్య‌వంశీని స్టాండ్ కే ప‌రిమితం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యింది ఫ్యాన్స్ నుంచి.. దీనిపై తీవ్రంగా స్పందించాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్.

నా అభిప్రాయం ప్రకారం వైభవ్ సూర్యవంశీని ఆడించ కూడదన్న నిర్ణయం పూర్తిగా సరైనదన‌ని పేర్కొన్నాడు. అర్హత లేదా ప్రతిభ లేకుండానే ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే వేదిక భారత జట్టు కాదు. భారత్ తరఫున ఆడటం అంటే దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించడం. కేవలం వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడం కోసం సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మలను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు; వారిద్దరి విషయంలో ఎటువంటి లోపం లేదు. వారు ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు. వారిని పక్కన పెట్టడంలో అర్థం లేదు, కాబట్టి జట్టు యాజమాన్యం సరైన నిర్ణయమే తీసుకుంది. సంజు శాంసన్ లేదా అభిషేక్ శర్మల ఫామ్ క్షీణించినప్పుడు వైభవ్‌కు అవకాశం లభిస్తుంది. అప్పటి వరకు, ప్లేయింగ్ XIలో అతనికి చోటు కల్పించాల్సిన అవసరం లేదు.

  • Related Posts

    ఏపీని క్రీడా హ‌బ్ గా మార్చేందుకు స‌హ‌క‌రించండి

    అమ‌రావ‌తి : ఏపీని క్రీడా కేంద్రంగా మార్చేందుకు జై షా మద్దతు కోరారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి క్రీడా…

    ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా ల్యూక్ విలియమ్స్

    ముంబై : ఐపీఎల్ 2027లో పోటీ ప‌డ‌నున్న ముంబై ఇండియ‌న్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ల్యూక్ విలియ‌మ్స్ వ్య‌వ‌హ‌రిస్తాడు. 2025లో బాధ్యతలు చేపట్టిన లీసా కీట్లీ ఆ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *