టీమ్ ఇండియా ఆట‌తీరుపై గంభీర్ అస‌హ‌నం

ఐర్లాండ్ తో 2-0 సీరీస్ కోల్పోవ‌డంపై ఆగ్ర‌హం

ఐర్లాండ్ : భార‌త జ‌ట్టు ఆట తీరుపై ప్ర‌ధానంగా బ్యాటింగ్ లో పూర్ ప‌ర్ ఫార్మెన్స్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్. ఇలా ఆడితే భ‌విష్య‌త్తులో నెట్టుకు రావ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. ఐర్లాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లు జ‌రిగాయి. ఈ రెండు మ్యాచ్ ల‌ను కోల్పోయింది టీమ్ ఇండియా. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అద్భుతంగా ఆడింది. ప్ర‌త్యేకించి అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఇండియాపై పై చేయి సాధించింది. సీరీస్ ను కోల్పోయిన త‌ర్వాత స్పందించాడు గంభీర్.

ఈ సిరీస్ మొత్తంలో మా బ్యాటింగ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఈ రోజు పిచ్ చాలా బాగుంది, పైగా ఐర్లాండ్ సాధించిన స్కోరు కంటే మరో 10 పరుగులు ఎక్కువగా ఉంటేనే అది పోటీనిచ్చే స్కోరు అయ్యేదని నా అభిప్రాయం. అయినప్పటికీ, మేము ఆ లక్ష్యాన్ని ఛేదించలేక పోయాము. ఇది నిజంగా నిరాశాజనకం , సిగ్గుచేటు. బ్యాటర్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. ఈ సిరీస్‌లో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని, రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ కోసం మమ్మల్ని మేము బాగా సిద్ధం చేసుకుంటాం అన్నారు గౌత‌మ్ గంభీర్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *