వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న వార్షిక పవిత్రోత్సవాలకు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, అంకురార్పణ తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా జూలై 26న పవిత్ర ప్రతిష్ఠ, జూలై 27న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 28న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, శ్రీ చండికేశ్వర స్వామివార్ల పంచమూర్తులతో తిరువీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని ద‌ర్శ‌నం చేసుకునే భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.

  • Related Posts

    జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్…

    మీనాక్షి ఆల‌య ప్ర‌సాదం స్వీక‌రించిన సీఎం విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ను సోమ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి టీవీకే ర‌మేష్. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ఆల‌య‌మైన మీనాక్షి సుంద‌రేశ్వ‌ర‌ర్ ఆల‌య ప్ర‌సాదాన్ని సీఎంకు స్వ‌యంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *