newsseals.com

జోగులాంబ స‌న్నిధిలో ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

September 21, 2026 · VijayaBhaskar

జోగులాంబ గ‌ద్వాల జిల్లా : భార‌త దేశంలో అత్యంత సుప్రిసిద్ద‌మైన శ‌క్తి పీఠంగా విరాజిల్లుతున్న తెలంగ‌దాణ‌లోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఆలంపూర్ లోని జోగులాంబ బాల బ్ర‌హ్మేశ్వ‌ర ఆల‌యాన్ని సోమ‌వారం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ బర్దన్ దంపతులు ఆలంపూర్ ఆలయాలను సందర్శించారు. అనంత‌రం ఆల‌యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలంపూర్ కు చేరుకున్న ఉత్తరాఖండ్ సిఎస్ దంపతులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆలయ అధికారులు మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోకి మేళ తాళాలతో తీసుకెళ్లారు. ముందుగా సిఎస్ దంపతులు విఘ్నేశ్వరుని దర్శించుకొని అనంతరం స్వామివారి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జోగులాంబ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు క్షేత్ర విశిష్టతను గురించి సిఎస్ దంపతులకు వివరించారు. వేద ఆశీర్వచనం చేసి స్వామి, అమ్మవార్ల ప్రసాదాలను అందజేశారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైని డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, ఆలయ కార్య నిర్వహణాధికారి దీప్తిరెడ్డి, ఆలంపూర్ తహసిల్దార్ ప్రభాకర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related News