newsseals.com

చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా జహీర్ ఖాన్

September 22, 2026 · VijayaBhaskar

చెన్నై : చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వచ్చే ఏడాది లో జ‌రిగే సీఎస్కే జ‌ట్టుకు నూత‌న హెడ్ కోచ్ గా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, స్టార్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్ ను నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ నియామ‌కం తక్ష‌ణ‌మే అములులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం సీఎస్కేకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ ఏడాది ఊహించ‌ని రీతిలో భారీ ధ‌ర‌కు సంజు శాంస‌న్ ను తీసుకుంది. ఇదిలా ఉండ‌గా జహీర్ ఖాన్ గ‌తంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలు చేపట్టనున్నారు. 18 సీజన్ల పాటు జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ నియమితులయ్యారు.

చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా జహీర్ ఖాన్‌కు స్వాగతం అని CSK ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. త్వరలో 48 ఏళ్లు పూర్తి చేసుకోనున్న జహీర్, భారత్ తరపున 92 టెస్టులు, 200 వన్డేలు మరియు 17 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. చారిత్రాత్మక 2011 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచారు. 2024 సీజన్‌లో ఆయన లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటార్‌గా పనిచేశారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఫ్లెమింగ్ గత ఏడాది జూలైలోనే ప్రకటించారు. MS ధోని, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ , యజమాని రూప గురునాథ్‌లతో కూడిన CSK క్రికెట్ నిర్వహణ కమిటీ ఈసారి భారతీయ కోచ్‌ను నియమించాలని భావించినట్లు సమాచారం.

Related News