శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ , ఇతర సౌకర్యాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.వి. మురళీకృష్ణ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో బుధ‌వారం ప‌రిశీలించారు. శ్రీవారి ఆలయం పరిసరాలు, నాలుగు మాడ వీధులు, భక్తుల గ్యాలరీలు, ఔటర్ రింగ్ రోడ్, అలిపిరి టోల్‌గేట్ తదితర కీలక ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల కదలికలు, రద్దీ నియంత్రణ, పార్కింగ్ సామర్థ్యం, భద్రతా పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు.

పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక: తిరుమలలో అందుబాటులో ఉన్న పరిమిత పార్కింగ్ స్థలాలను దృష్టిలో ఉంచుకుని వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పార్కింగ్ నిర్వహణ చేపట్టాలని సూచించారు. రద్దీకి అనుగుణంగా వాహనాలను క్రమబద్ధీకరించడం, అవసరమైన చోట్ల డైవర్షన్లు, బ్యారికేడింగ్, మార్గదర్శక సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల నుంచి భక్తుల రవాణాకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సమన్వయంతో పర్యవేక్షించాలని సూచించారు.

వాహన సేవల సమయంలో నాలుగు మాడ వీధుల్లో భారీగా భక్తులు చేరే అవకాశం ఉన్నందున ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, గ్యాలరీలు, బ్యారికేడ్లు, అత్యవసర మార్గాలు స్పష్టంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అధిక రద్దీ ఏర్పడిన సందర్భంలో వెంటనే స్పందించేలా సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. CCTV, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్‌తో నిరంతర నిఘా: తిరుమల.. తిరుపతి పరిధిలో ఏర్పాటు చేసిన CCTV వ్యవస్థలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ వ్యవస్థల ద్వారా భక్తుల రద్దీ, వాహనాల కదలికలు, కీలక ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రద్దీ పెరుగుతున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు చేపట్టేలా పోలీసు, టీటీడీ విజిలెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

  • Related Posts

    అమీన్ పీర్ ద‌ర్గా ఉత్స‌వాల‌కు ఆహ్వానం

    అమ‌రావ‌తి : ఏపీలోని కడప అమీన్ పీర్ దర్గా పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా ఉర్సు హాజరు కావలసిందిగా ఈ రోజు ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి కె.ఎస్.ఎస్. ఆరీఫుల్లా హుస్సేనీ…

    గవిసిద్దేశ్వర స్వామీజీకి స‌ర్కార్ ఆహ్వానం

    బెంగ‌ళూరు : మైసూరు దసరా ప్రారంభోత్సవానికి గవిసిద్దేశ్వర స్వామీజీని ఆహ్వానించింది క‌ర్ణాట‌క స‌ర్కార్. | ఈ ఏడాది దసరా ఉత్సవాలను గవిసిద్దేశ్వర స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభించాలని ఇటీవల నిర్ణయించింది. కొప్పళ: మైసూరు డిప్యూటీ కమిషనర్ లక్ష్మీకాంత్ రెడ్డి జి కొప్పళలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *