27 మందికి కారుణ్య నియామ‌కాలు : గొట్టిపాటి ర‌వికుమార్

అమ‌రావ‌తి : అమ‌రావ‌తి స‌చివాల‌యంలో 27 మందికి కారుణ్య నియామ‌క ప‌త్రాలు అంద‌జేశారు బుధ‌వారం ఇంధ‌న శాఖ మంత్రి మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్. ప్రాణాలు సైతం లెక్క చేయ‌కుండా విధులు నిర్వ‌హించే ఉద్యోగుల ర‌క్ష‌ణ‌కు విద్యుత్ శాఖ క‌ట్టుబ‌డి ఉందన్నారు. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన ఉద్యోగుల కుటుంబ స‌భ్యుల‌కు నాలుగు నెల‌ల్లోనే ఉద్యోగాలిచ్చి భ‌రోసా క‌ల్పిస్తున్నాం అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు 627 మందికి విద్యుత్ శాఖ‌లో కారుణ్య నియామ‌కాల కింద ఉద్యోగాలు క‌ల్పించడం జ‌రిగింద‌ని చెప్పారు. స‌చివాల‌యాల్లోని 7 వేల మంది ఎన‌ర్జీ అసిస్టెంట్ల‌కు కూడా శిక్ష‌ణ ఇచ్చి విద్యుత్ శాఖ‌లో వినియోగించుకుంటాం అని స్ప‌ష్టం చేశారు.

సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశంలో ఉద్యోగుల స‌హ‌కారంతో ఎల్ నినో ప‌రిస్థితుల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నామని అన్నారు మంత్రి. సాయంత్రం 7 గంట‌ల నుంచి 11 వ‌ర‌కు పీక్ అవ‌ర్స్ లో కూడా రాష్ట్ర ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా కొన‌సాగిస్తున్నామని పేర్కొన్నారు. గృహ అవ‌స‌రాల‌తో పాటు రైతులు,ఆక్వా, పారిశ్రామిక, వ్యాపార అవ‌స‌రాల‌కు కూడా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామన్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఇంత వ‌ర‌కు ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలు పెంచ‌లేదన్నారు. 629 ఏఈఈ పోస్టుల‌కు సంబంధించి త్వ‌ర‌లోనే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ అనంత‌రం పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామని ప్ర‌క‌టించారు గొట్టిపాటి ర‌వికుమార్.

  • Related Posts

    ఉపాధ్యాయులు సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగు పరచుకుంటూ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా విద్యాశాఖ జ్ఞాన దీప్తి కార్యక్రమం ఆధ్వర్యంలో బుధవారం గోనుపాడు గ్రామంలోని…

    ఎల్ నినో ఎఫెక్ట్ ఉపాధిపై స‌ర్కార్ ఫోక‌స్

    హైద‌రాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుముఖం పట్టిన తరుణంలో, గ్రామీణ కూలీలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *