కర్ణాటక : ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రాష్ట్రంలో చెరకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెరకు రైతుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉత్తర కర్ణాటకలో క్రషింగ్ సీజన్‌ను ప్రారంభించేందుకు వీలు కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు ఐదు కీలక డిమాండ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు: పెరుగుతున్న చెరకు ధరలకు అనుగుణంగా, రైతులకు సరసమైన ధరలు లభించేలా ప్రస్తుత కిలోకు రూ. 31 ఉన్న చక్కెర కనీస మద్దతు ధర ను సవరించాలని పేర్కొన్నారు లేఖలో. గృహ వినియోగదారులను కాపాడుతూనే, బల్క్ కొనుగోలుదారులకు సరసమైన ధరలు లభించేలా దేశీయ , వాణిజ్య చక్కెరపై వేర్వేరు ఎంఎస్పీలను ప్రవేశ పెట్టాలన్నారు సీఎం.
ఇథనాల్ సేకరణ మినహాయింపులను సమీక్షించాలని చెరకు రసం, చక్కెర సిరప్, బి-హెవీ మొలాసిస్ నుండి ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు సరసమైన కేటాయింపులు ఉండేలా చూడాలన్నారు. పెరుగుతున్న చెరకు ధరలకు అనుగుణంగా చెరకు ఆధారిత ఇథనాల్ ధరలను పెంచాలని కోరారు సీఎం. తక్కువ రికవరీ ఉన్న ప్రాంతాల్లోని రైతులను కాపాడటానికి ఎఫ్‌ఆర్‌పి బేస్ రికవరీ రేటును 9.50%కి పునరుద్ధరించాలని పేర్కొన్నారు డీకే శివకుమార్. తూకంలో పారదర్శకతను మెరుగు పరచడానికి, చక్కెర రికవరీ పరీక్షను బలోపేతం చేయడానికి , రైతులకు అదనపు ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర అధికార పరిధిలో చర్యలు తీసుకున్నందున, ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు పీఎంను.




