ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్

చిత్తూరు జిల్లా : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉండేందుకు జ‌గ‌న్ 2.0 యాప్ ను తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. నగరి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలోనగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే. రోజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి “పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్” పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రోజా గారు మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఎస్సార్సీపీపై జరుగుతున్న కుట్రలు, నాయకులు , కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, పార్టీ అధికారిక కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయడంలో జగన్ 2.0 యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ప్ర‌క‌టించారు.

ప్రతి వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్త, అభిమాని తప్పనిసరిగా జగన్ 2.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. “పార్టీకి ప్రజలే బలం – ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్” అనే నినాదంతో ప్రతి ఇంటికి చేరువై పార్టీని మరింత బలోపేతం చేయాలని రోజా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, మండల మున్సిపాలిటీ పార్టీ బూత్ కమిటీ అనుబంధ కమిటీ అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • Related Posts

    భారతదేశంలోని టాప్ 10 మెడిక‌ల్ కాలేజీలు ఇవే

    హైద‌రాబాద్ : నీట్ యూజీ 2026 ఫలితాలు వెలువడ్డాయి. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. నీట్‌లో అర్హత సాధించిన తర్వాత తీసుకోవాల్సిన అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి సరైన వైద్య కళాశాలను ఎంచుకోవడం. భారతదేశంలో అద్భుతమైన విద్య, అనుభవజ్ఞులైన…

    నా భ‌ర్త‌ను అక్ర‌మంగా నిర్బంధించారు

    న్యూఢిల్లీ : త‌న భ‌ర్త ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ ను అక్ర‌మంగా నిర్బంధించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వాంగ్ చుక్ భార్య‌. ఆదివారం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *