
సత్తా చాటిన కేఎల్ రాహుల్ సెంచరీ
గుజరాత్ : అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో శుభ్ మన్ గిల్ సారథ్యంలోని టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశగా ముందుకు సాగుతోంది. వెస్టిండీస్ ప్రస్తుతం భారత్ లో టెస్టు సీరీస్ ఆడేందుకు ఇండియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి టెస్టు ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. 162 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం మైదానంలోకి దిగింది భారత జట్టు లంచ్ టైం ముగిసే సమయానికి టీమ్ ఇండియా 3 కీలక వికెట్లను కోల్పోయింది. 218 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా భారత జట్టుకు చెందిన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ సూపర్ షో చేశాడు.
ఆకట్టుకునేలా ఆడాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. తను సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. ఇంకా ఆట ఆడేందుకు ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగుతోంది. 2వ వికెట్ కు 121 రన్స్ చేసింది. ఇదిలా ఉండగా భారత జట్టు సారథి శుభమన్ గిల్ నాయకుడిగా రాణించాడు. మరోసారి సత్తా చాటాడు. 50 రన్స్ చేశాడు సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో ఉన్నట్టుండి హాఫ్ సెంచరీ వద్ద తన స్కోర్ ఆగి పోయింది. అయినా ఎక్కడా తొణకలేదు కేఎల్ రాహుల్. ఇప్పటికే తన ఆట తీరుతో దుమ్ము రేపుతూ వస్తున్న సదరు క్రికెటర్ సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రేపు రాబోయే 3 రోజుల్లో ఇండియా సూపర్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది.