డోకిపర్రు మహాక్షేత్రం భ‌క్త జ‌న‌సందోహం

డోకిపర్రు (గుడ్లవల్లేరు) : డోకిపర్రు మహాక్షేత్రంలోని భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం కోసం వందలాది మంది భక్తులు వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీవీ కృష్ణా రెడ్డి, సుధా రెడ్డి పర్యవేక్షణలో ఆలయ నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ ఆధ్వర్యంలో శ్రీనివాస వ్రతాన్ని నిర్వహించారు. వ్రతానికి హాజరైన భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసి, పూజా కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా వారు చూశారు .

శ్రీనివాస వ్రతంలో భాగంగా ముందుగా భక్తులు సంకల్పం చేసుకున్నారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన తదితర కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ భూదేవి అమ్మవారిని స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. వ్రతంలో భాగంగా స్వామివారి అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం, హారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు.వ్రతానికి హాజరైన దంపతులు, భక్తులు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణ, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పూజా కార్యక్రమాల అనంతరం స్వామి వారికి ప్రత్యేక నైవేద్యం సమర్పించి, మహాహారతి నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

శ్రీనివాస వ్రతం సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు భక్తి పారవశ్యంతో గోవింద నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వ్రతం విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

  • Related Posts

    నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో గోదావరి హారతి

    తిరుపతి : గోదావరి నదికి ఆధ్యాత్మిక సంప్రదాయ బద్ధంగా హారతి సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపినాథ్ శనివారం టిటిడి శ్వేత సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. టిటిడి, దాస సాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి…

    అప్పలాయగుంట‌ ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’

    తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *