హౌసింగ్ ఫర్ ఆల్‌కు సహకరించండి : సీఎం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశారు. 3 లక్షల కొత్త ఇళ్లను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు.. మరిన్ని ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత గృహ అవసరాలు తీరాలంటే మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో మిగిలి ఉన్న గ్రామీణ గృహ అవసరాలను పూర్తిగా తీర్చి, 2029 నాటికి ప్రతి పేద కుటుంబానికి శాశ్వత ఇల్లు అందించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు. 6 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే, ఆ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సీఎంఆ లేఖలో హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ అంశాలపై వ్యక్తిగత చొరవ తీసుకుని, నిధుల విడుదల, అవసరమైన అనుమతుల ప్రక్రియ వేగవంతం అయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎం కోరారు.

  • Related Posts

    మ‌హిళ‌ల‌ను కించప‌రిస్తే చూస్తూ ఊరుకోం : విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌హిళ‌ల ప‌ట్ల ఎవ‌రు చుల‌క‌న చేసి మాట్లాడినా లేదా దూషించినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం. ఆదివారం తిరుప్పూర్ జిల్లాలో…

    రైతులకు న్యాయం జరిగే వరకు భూముల్లోకి రావద్దు : మ‌ల్ల‌న్న‌

    జోగులాంబ గ‌ద్వాల జిల్లా : మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ బాధిత రైతుల తరఫున అధికారులతో మాట్లాడారు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా వారితో భేటీ అయ్యారు. ఈ మేర‌కు వెంట‌నే స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *