శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో
తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఆలయ ప్రాకారంలో ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ గోవిందరాజ స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం, ఉపాలయాల్లో కార్తీక దీపం వెలిగించారు. ఇదే సమయంలో భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
ఇదిలా ఉండగా తిరుపతి నగరంలోని అత్యంత పేరు పొందిన శ్రీ కోదండ రామాలయంలో కూడా సాయంత్రం కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయానికి తీసుకువచ్చి, కార్తీక దీపాలను వెలిగించారు. దీంతో ఆలయాలు సర్వశోభాయమానంగా ఆకట్టుకున్నాయి భక్తులను.






