సంచలన వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్
ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో విండీస్ పై ఇండియా గెలుపు సాధించడంలో కీలకమైన పాత్ర పోషించాడు సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఏకంగా 50 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 4 సిక్సులతో 97 రన్స్ చేశాడు. ఆట చివరి దాకా ఉన్నాడు. తనే దగ్గరుండి ఇండియాను గెలిపించాడు. ఈ సందర్భంగా శాంసన్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని క్రికెట్ అభిమానులకు, ప్రత్యేకించి యువతకు కీలక సూచనలు చేశాడు.
జీవితంలో ఎదగాలంటే చేసే పనిపట్ల దృష్టి సారించాలని అన్నాడు. ప్రత్యేకించి మనల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే సెల్ ఫోన్ ను, సోషల్ మీడియాను పూర్తిగా పక్కన పెట్టాలని సూచించాడు. తాను వాటి గురించి అస్సలు పట్టించుకోనని చెప్పాడు సంజూ శాంసన్. షాట్ సెలక్షన్ అనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడతానని అన్నాడు. దీనినే చివరి వరకు ఫాలో అయ్యానని తెలిపాడు. కాబట్టి నేను నన్ను నేను నమ్ముకుంటూనే ఉన్నాను, నా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసాను, సోషల్ మీడియాను స్విచ్ ఆఫ్ చేసాను , నా స్వంత మాట విన్నానని పేర్కొన్నాడు శాంసన్.








