ప్రశంసలు కురిపించిన సచిన్ టెండూల్కర్
ముంబై : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది చరిత్ర సృష్టించేందుకు . ఈనెల 8న అహ్మదాబాద్ వేదికగా కీవీస్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక కీలకమైన , అత్యంత ముఖ్యమైన సెమీ ఫైనల్ మ్యాచ్ మాత్రం ఉత్కంఠను రేపింది. కోట్లాది అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మ్యాచ్ ను అత్యధికంగా వీక్షించినట్లు సమాచారం. ఇండియా ఫైనల్ కు చేరుకోవడంతో దేశ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. రాజకీయ, సినీ, వ్యాపార, వాణిజ్య తదితర రంగాలకు చెందిన ప్రముఖులు భారత జట్టు సాధించిన విజయాన్ని, ప్రత్యేకించి సంజూ శాంసన్ ఆడిన ఆట తీరు గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇందులో భాగంగా భారత జట్టు మాజీ కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్ స్పందించాడు. అద్భుత విజయాన్ని నమోదు చేసినందుకు ఆనందంగా ఉందన్నాడు. ఇది మరిచి పోలేని మ్యాచ్ అంటూ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్లు సైతం శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశారు. తను కేవలం 42 బంతులు మాత్రమే ఆడాడు. 8 ఫోర్లు 7 సిక్సులతో 89 పరుగులు చేశాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మరో వైపు ఇంగ్లండ్ సైతం అదే స్థాయిలో పోరాడింది. 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొత్తంగా సమిష్టి కృషితో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది.








