ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడుకోవాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌ల నుంచి చెరువుల‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరంలో గత పదేళ్లలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాల పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. ప్రజాహితం కోసం అవన్నీ మౌనంగా భరించాన‌ని చెప్పారు సీఎం. ఈ రోజు ఫలితాలు చూస్తుంటే, ప్రజల స్పందన చూస్తుంటే వాళ్ల ఆరోపణలే నాకు ఆశీర్వాదాలుగా మారాయని అనిపోస్తోంద‌ని చెప్పారు.

పేదవాడిని ఇబ్బంది పెట్టడం, ఇళ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. వరదలు వచ్చినపుడు పేదలు ముంపు బాధితులుగా మిగల కూడదు అనేది మా తపన అన్నారు సీఎం. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి నా సూచన. మీకు న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రకృతి పునరుద్ధరణ కు సహకరించాలని కోరారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తాం అన్నారు. పిల్లల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Related Posts

ల‌క్ష్మీనారాయ‌ణ చెరువును కాపాడుతాం : హైడ్రా

హైద‌రాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలోని ఏదులాబాద్ చెరువును కాపాడుతామ‌ని స్ప‌ష్టం చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. దీనిని కాపాడాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున గ్రామ‌స్తులు హైడ్రాకు ఫిర్యాదు చేయ‌డంతో ఇవాళ క‌మిష‌న‌ర్ ఉప్పల్ జోనల్…

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం నిర్వ‌హించాలి

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ఈ నెల 17న జరగనున్న ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *