శ్రీ‌ధ‌ర్ బాబుకు శార‌దా పీఠం ఉత్త‌రాధికారి ఆహ్వానం

Spread the love

రావాల‌ని కోరిన ఉత్త‌రాధికారి స్వాత్మానందేంద్ర

హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శ‌నివారం మ‌ర్యాద పూర్వ‌కంగా రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లోని
కోకాపేట శారదా పీఠంలో నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా నిర్వ‌హించే ఉగాది ఆస్థానానికి రావాల‌ని ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆహ్వాన ప‌త్రిక‌ను శ్రీ‌ధ‌ర్ బాబుకు అంద‌జేశారు. ఇదిలా ఉండ‌గా త‌మ మ‌ఠంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంలో కీల‌క పాత్ర పోషించినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుకు.

ఇదే క్ర‌మంలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుమ‌ల రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి . శారదా పీఠం సమస్యను వెంటనే పరిష్కరించినందుకు ఆయ‌న‌ను మ‌రిచి పోలేమ‌ని అన్నారు. ఇదే క్ర‌మంలో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబుకు మ‌రోసారి థ్యాంక్స్ తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని ఆశీర్వదించి ప్రసాదాలు అందించారు స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి. ఇదిలా ఉండ‌గా ఈ స‌మావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్ కూడా ఉన్నారు.

  • Related Posts

    శ్రీ తిరుమలనాధ స్వామికి ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ‌

    Spread the love

    Spread the loveటీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్సీ మ‌ల్ల‌న్న‌ యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం చీకటిమామిడి గ్రామంలో వెలసిన శ్రీ తిరుమలనాధ స్వామి బ్రహ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. ఉత్స‌వాల‌లో భాగంగా…

    దర్శన క్యూలైన్ లో నినాదాలు చేస్తే చ‌ర్య‌లు

    Spread the love

    Spread the loveటీటీడీని, శ్రీవారి భక్తులను క్షమాపణ కోరిన భక్తుడు తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజ మహేంద్రవరానికి చెందిన అనురోజు వీర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *