డికాక్ స‌త్తా చాటినా గ‌ట్టెక్క‌ని ముంబై ఇండియ‌న్స్

Spread the love

60 బంతులు 112 ర‌న్స్ 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు

ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ కంటిన్యూ విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో స‌త్తా చాటుతోంది. ప్ర‌ధానంగా కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ పంజాబ్ జ‌ట్టుకు వ‌రంగా మారాడు. అన్నీ తానై ఆడుతున్నాడు. జ‌ట్టుకు అండ‌గా ఉంటున్నాడు. తాజాగా ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ పోరులో ప్ర‌త్య‌ర్థి ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టును స్వంత గ‌డ్డ‌పై ఓడించి విస్తు పోయేలా చేశారు పంజాబ్ ఆట‌గాళ్లు. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియ‌న్స్ .

నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 195 ప‌రుగులు చేసింది. క్వింట‌న్ డికాక్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు. పంజాబ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 60 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని సూప‌ర్ సెంచ‌రీ చేశాడు నాటౌట్ గా నిలిచాడు. 8 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 112 ర‌న్స్ చేశాడు. ఇక డికాక్ తో పాటు న‌మ‌న్ ధీర్ రెచ్చి పోయాడు. 31 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అనంత‌రం పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. యంగ్ క్రికెట‌ర్ ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. చాహ‌ర్ వేసిన తొలి ఓవ‌ర్ లోనే 4, 4, 6, 4 కొట్టాడు. అయ్య‌ర్ కూడా తానేమీ త‌క్కువ కాద‌ని నిరూపించాడు.

  • Related Posts

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    Spread the love

    Spread the loveమ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ…

    క్రీడా రంగంలో ఏపీని టాప్ లో నిలుపుతాం

    Spread the love

    Spread the loveకీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ తిరుప‌తి జిల్లా : ఏపీని క్రీడా రంగంలో టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌. బుధ‌వారం తిరుపతిలోని శ్రీ శ్రీనివాస…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *