సన్ రైజర్స్ సూపర్ విక్టరీతో షాక్
జైపూర్ : కావ్య మారన్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కారణం తమ జట్టు వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ లో ప్రత్యర్థి జట్లకు ఝలక్ ఇస్తోంది. ప్రధానంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మలు సూపర్ ఫామ్ తో ఆకట్టుకుంటున్నారు. బౌలర్ల భరతం పడుతున్నారు. తాజాగా జరిగిన కీలక లీగ్ పోటీలో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మరోసారి యంగ్ క్రికెటర్, ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన శైలిలో ఆడాడు. హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. ఈ ఇద్దరు బౌలర్లు రాజస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 74 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శర్మ 57 29 బాల్స్ ఎదుర్కొని 57 రన్స్ చేశాడు. 11 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి 132 పరుగులు జోడించారు. నితీశ్ కుమార్ 36 రన్స్ చేస్తే క్లాసెన్ 29 పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేష్ 44 రన్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చితే ఆర్చర్ 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.





