newsseals.com
DEVOTIONAL

వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి ద‌ర్శ‌నం

VijayaBhaskar April 27, 2026
newsseals-PothuluriVeeraBrahmam
Spread the love

శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం

నంద్యాల జిల్లా : ఆళ్ల‌గ‌డ్డ నియోక‌వ‌ర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉత్స‌వాల‌లో భాగంగా ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి పర్వదినాన శ్రీ స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 12 మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారు సింహాసనాసీనులై అశేష భక్త జనావళికి దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా మ‌ఠాధిప‌తి ఉపదేశం ఇచ్చారు. పోతులూరి వీరబ్ర‌హ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాల‌జ్ఞానం ఇప్ప‌టికీ వెలుగులు పంచుతూనే ఉంద‌న్నారు. ఆయ‌న చెప్పిన ప్ర‌తిదీ నిజమైంద‌ని అన్నారు. ప్రతి ఏటా ఆరాధ‌నా ఉత్స‌వాలు నిర్వ‌హించ‌డం ఆనవాయితీగా వ‌స్తోంద‌ని చెప్పారు శ్రీ‌శ్రీ‌శ్రీ వీర ధ‌ర్మ‌జ వెంక‌టాద్రి స్వాముల వారు. ప్ర‌భుత్వ , దేవాదాయ ధ‌ర్మాదాయ స‌హ‌కారంతో ఆల‌యంలో ప‌లు అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని అన్నారు.