సింహాచ‌లం స‌న్నిధిలో అశ్విని వైష్ణ‌వ్, బాబు

Spread the love

తెలుగు ప్ర‌జ‌లు బాగుండాల‌ని కోరుకున్నా

విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన అనంతరం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, త‌దిత‌ర‌లు. ఈ సంద‌ర్బంగా ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, వేద పండితులు ఘ‌నంగా సాద‌ర స్వాగ‌తం ప‌లికారు కేంద్ర మంత్రి, సీఎంకు.

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామికి ఘ‌నంగా పూజ‌లు చేశారు. అంతా మంచే జరిగేలా చూడాలని ప్రార్థించానని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భావితరాలకు ఉపయోగపడే ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని మన రాష్ట్రానికి రావాలని స్వామి వారిని వేడుకున్నాన‌ని తెలిపారు. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు తోడైతే అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. స్వామిని ద‌ర్శించు కోవడం మ‌రిచి పోలేని అనుభూతిని మిగిల్చింద‌న్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్.

  • Related Posts

    వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి ద‌ర్శ‌నం

    Spread the love

    Spread the loveశ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం నంద్యాల జిల్లా : ఆళ్ల‌గ‌డ్డ నియోక‌వ‌ర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉత్స‌వాల‌లో భాగంగా ఈ రోజున వైశాఖ…

    మే నెల‌ తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో వ‌చ్చే మే నెల‌కు సంబంధించి నిర్వ‌హించే ప‌ర్వ‌దినాల వివ‌రాలు వెల్ల‌డించింది. ఇందులో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *