సంజు శాంస‌న్ ఆడిన తీరు సింప్లీ సూప‌ర్

ప్ర‌శంస‌లు కురిపించిన ఇయాన్ మోర్గాన్

ఢిల్లీ : మాజీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆట తీరు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న ఆట తీరు అద్భుతం అన్నాడు. రోజు రోజుకు త‌ను ఆడుతున్న వైనం సింప్లీ సూప‌ర్ అని పేర్కొన్నాడు. ఢిల్లీ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సంజు శాంస‌న్ 52 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. మ‌రో వైపు కార్తీక్ శ‌ర్మ త‌న‌కు తోడుగా నిలిచాడు. ఈ సంద‌ర్బంగా శాంస‌న్ క‌ళ్లు చెదిరేలా ఆడాడంటూ పేర్కొన్నాడు మోర్గాన్.

సంజు స్థాయి ఇంతకంటే ఇంకా పెరుగుతుందని నేను అనుకోలేదు, కానీ ఈ ఇన్నింగ్స్‌తో అతను తన విలువను మరింత పెంచుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతను ప్రదర్శించే సంయమనం అతని అనుభవాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. అతను తన ఆటతీరునే మాట్లాడనిస్తాడు. ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడిలా లక్ష్య ఛేదనను నడిపించడం, ఒకవైపు ముందుండి జట్టును నడిపిస్తూనే మరోవైపు కార్తీక్ శర్మ వంటి యువ ఆటగాడికి మార్గనిర్దేశం చేయడం ఇదంతా చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు .

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *