భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు

Spread the love

ఉచిత లాక‌ర్లు పెద్ద ఎత్తున అంద‌జేత‌

తిరుమ‌ల : వేస‌వి కాలం కావ‌డంతో శ్రీ‌వారి భ‌క్తులు పోటెత్తారు. వసతి గదులు లభించని భక్తుల కోసం టీటీడీ తిరుమలలో ఐదు యాత్రికుల వసతి సముదాయాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలలో భక్తులు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు నమోదు చేసి ఉచిత లాకర్లు మరియు ఇతర సౌకర్యాలను పొందవచ్చు.
సీఆర్వో సమీపంలోని గోవర్ధన్ సత్రం ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 4 హాళ్లు, 1256 లాకర్లు ఉన్నాయి. ప్రస్తుతం పునరుద్ధరణ పనుల కారణంగా 870 లాకర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అన్నప్రసాదం సౌకర్యం కలదు.

బాలాజీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఈ సముదాయంలో 12 హాళ్లు, 3300 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పించే సదుపాయం, ప్రథమ చికిత్స కేంద్రం, విశ్రాంతి సదుపాయాలు కల్పించబడ్డాయి. జీఎన్సీ టోల్ గేట్ నుండి రాంభగీచా బస్ స్టాండ్కు వెళ్లే ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ఈ భవనంలో 9 హాళ్లు, 1420 లాకర్లు ఉన్నాయి. తలనీలాలు సమర్పించే సదుపాయం , విశ్రాంతి సౌకర్యం కలదు.

బాలాజీ బస్ స్టాండ్ లోపల ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 3 హాళ్లు, 960 లాకర్లు ఉన్నాయి. ఇక్కడ విశ్రాంతి, లాకర్, స్నాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ ఆధునిక సముదాయాన్ని 2025 సెప్టెంబర్ 25న భారత ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. CRO వెనుక భాగంలో ఉన్న ఈ భవనంలో 16 హాళ్లు, 2400 లాకర్లు ఉన్నాయి. అన్నప్రసాదం, తలనీలాలు సమర్పణ, ప్రథమ చికిత్స, విశ్రాంతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

  • Related Posts

    టిటిడి జూనియర్ కళాశాల‌ల్లో ప్రవేశాలకు ఆహ్వానం

    Spread the love

    Spread the loveవిద్యార్థుల‌కు ఉచితంగా మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు తిరుపతి : టిటిడి తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌ల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్‌లో…

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

    Spread the love

    Spread the loveదాత‌ల‌ను అభినందించిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *