4 ఓవర్లు 39 రన్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌలర్
ధర్మశాల : ఐపీఎల్ 19 సీజన్ లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో మరోసారి తనేమిటో చూపించాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన బౌలర్ శార్దూల్ ఠాకూర్ కళ్లు చెదిరే బంతులతో ఝలక్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు తన బౌలింగ్ లో ఆడేందుకు . కేవలం 4 ఓవర్లు వేసిన ఠాకూర్ 39 రన్స్ ఇచ్చి నాలుగు కీలకమైన వికెట్లు కూల్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.
పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (27), ప్రభ్‌సిమ్రన్ సింగ్ 33 బంతులోన్లే 50 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఇంకా కొన్ని బంతులు మిగిలి ఉండగానే ఇచ్చిన టార్గెట్ ను ఛేదించింది. ఓపెనర్ రెకెల్టన్ ఆరంభంలో రెచ్చి పోతే మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రూథర్ ఫోర్డ్, వోక్స్ , తిలక్ వర్మలు మిగతా పని కానిచ్చేశారు. ప్రధానంగా ఆరంభంలోనే అదుర్స్ అనిపించాడు రెకెల్టన్. వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ 33 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 6 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తను 75 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.







