ఇరు జట్లకు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కీలకం
చెన్నై : ఐపీఎల్ 19 మెగా టోర్నీ అంతకంతకూ రసవత్తరంగా మారింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే సోమవారం చెన్నైలో జరిగే కీలక లీగ్ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది చెన్నై సూపర్ కింగ్స్ కు. రూ. 18 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఓపెనర్ సంజు శాంసన్ ఆటతీరు పేలవంగా ఉంది. తను అడపా దడపా ఆడుతున్నాడే తప్పా ఆశించిన మేర రాణించడం లేదు. మరో వైపు జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీంకు భారంగా మారాడు. ఇక సీఎస్కేకు ప్రధాన ఆటగాళ్లు గాయాల బారిన పడడం కూడా సమస్యగా మారింది. ఇదే సమయంలో తళా మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్ లో ఆడతాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
మరో వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బలంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసుపై ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది రుతురాజ్ గైక్వాడ్ సేనకు. ప్రధానంగా సంజు శాంసన్ రాణించడంపైనే జట్టు విజయం ఆధారపడింది. తాజాగా అందిన సమాచారం మేరకు చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోనున్నాయి. మళ్ళీ అకేల హుస్సేన్‌ను తుది ఎంపిక చేశారు. ఎం.ఎస్. ధోని చెపాక్‌లో తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగనున్నాడు. తనకు వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే చెపాక్‌కు చేరుకున్నారు.







