ఆయిల్ ప్యాక్ ప‌రిణామాల‌పై కీల‌క నిర్ణ‌యం

కీల‌క మార్పులు చేసిన ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ : కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందు కోసం వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీక రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వినియోగదారులకు మరింత పారదర్శకత, స్థిరత్వాన్ని తీసుకు రావాలనే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం వంట నూనెల కోసం ప్రామాణీకరించిన ప్యాక్ పరిమాణాలను ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది.

ఇదిలా ఉండ‌గా ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, 650గ్రా, 810గ్రా, 870గ్రా వంటి క్రమరహిత పరిమాణాలను దశలవారీగా తొలగించే అవకాశం ఉంది. దీనికి బదులుగా తయారీదారులు వంట నూనెలను 200 మిల్లీ లీటర్లు, 500 మిల్లీలీటర్లు, 1 లీటరు, 5 లీటర్లు, 15 లీటర్లు, 20 లీటర్లు లేదా కిలోగ్రాముల వంటి నిర్దిష్ట ప్యాక్ పరిమాణాలలో మాత్రమే విక్రయించడానికి అనుమతించ బడతారు. దీనివల్ల కొనుగోలుదారులకు ధరల నిర్ధారణ, పోలిక సులభతరం అవుతుందని స్ప‌ష్టం చేసింది కేంద్రం.

  • Related Posts

    ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

    అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

    వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *