ఆసియా క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ టాప్

రెండో స్థానంలో నిలిచిన తిల‌క్ వ‌ర్మ

హైద‌రాబాద్ : మెగా టోర్నీమెంట్ ఆసియా క‌ప్ 2025 ముగిసింది. సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ లో దాయాది పాకిస్తాన్ జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. టోర్నీలో 7 మ్యాచ్ లు ఆడింది. అన్నింటిని గెలుపొందింది. పాకిస్తాన్ ను మూడుసార్లు ప‌రాజయం పాలు చేసింది. టోర్నీలో స్టార్ యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ ప‌రుగుల ప‌రంగా చూస్తే టాప్ లో నిలిచాడు. త‌ను 7 మ్యాచ్ లు ఆడి 314 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక రెండో ప్లేస్ లో హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 7 మ్యాచ్ ల‌లో 213 ర‌న్స్ చేశాడు. ఇందులో 69 నాటౌట్ అత్య‌ధిక స్కోర్. శ‌ర్మ అత్య‌ధిక స్కోర్ 75 ప‌రుగులు. పాకిస్తాన్ ఓప‌నెర్ ఫ‌ర్హాన్ 217 ర‌న్స్ తో టాప్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఆరు మ్యాచ లో ఆడి 48 ర‌న్స్ చేశాడు. 120 ప‌రుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.

ఇక ఈ టోర్నీలో ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది శ్రీ‌లంక జ‌ట్టు గురించి. ఆ జ‌ట్టు త‌ర‌పున ఆడిన పాతుమ్ నిస్సాంక త‌ళుక్కున మెరిశాడు. భార‌త్ పై సెంచ‌రీ చేసిన ఏకైక క్రికెట‌ర్ గా నిలిచాడు. ఇండియా బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. త‌ను 107 ర‌న్స్ చేశాడు. మ‌రో క్రికెట‌ర్ కుశాల్ పెరీరా 146 ప‌రుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట‌ర్ సైఫ్ హ‌స‌న్ నాలుగు మ్యాచ్ లు ఆడి 178 ర‌న్స్ చేశాడు. కుల్దీప్ యాద‌వ్ 17 వికెట్లు తీశాడు. టాప్ లో నిలిచాడు. షాహిన్ అఫ్రిది 7 మ్యాచ్ ల‌లో 10 వికెట్లు తీశాడు. జ‌స్పీత్ బుమ్రా 135 ర‌న్స్ ఇచ్చి 7 వికెట్లు తీశాడు.

  • Related Posts

    ఆసియా క్రీడ‌ల్లో సెమీస్ కు చేరిన టీమిండియా

    జ‌పాన్ : ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ అనుకోకుండా సెమీస్ కు చేరుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత్ ఎంట్రీ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు ICC T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో (నంబర్ 1) ఉండగా, ఆఫ్ఘనిస్థాన్…

    ఏపీని క్రీడా హ‌బ్ గా మార్చేందుకు స‌హ‌క‌రించండి

    అమ‌రావ‌తి : ఏపీని క్రీడా కేంద్రంగా మార్చేందుకు జై షా మద్దతు కోరారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆధునిక మౌలిక సదుపాయాలు, క్రీడా సాంకేతికత, యువత నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి క్రీడా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *