జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు పేద‌ల‌కు వ‌రాలు

Spread the love

బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌

స‌త్య‌సాయి జిల్లా : కేంద్రం తీసుకు వ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య త‌ర‌గతి వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో జీఎస్టీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. దీర్ఘకాలిక వ్యాధులకు వినియోగించే ఔషధాలు జీఎస్టీ నుండి మినహాయించారన్నారు. వీటిని ప్రజలకు తెలియజేసి, జీఎస్టీ లబ్దిని ప్రతీ కుటుంబం సద్వినియోగం చేసుకునేలా నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి వారం ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపు కారణంగా ఏ వస్తువులు ఏ మేరకు తగ్గాయి, ప్రతీ కుటుంబానికి నెలకు ఎంత మేరకు ఆదా అవుతుందనే విషయాన్నీ తెలియజేయడం జరిగిందన్నారు.

రెండవ వారం వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వినియోగించే వస్తువులపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని, మూడవ వారం మానవ వనరుల అభివృద్ధి, విద్య, టూరిజం తదితర వాటికి సంబంధించి అవగాహన కలిగించడం జరుగుతుందని చెప్పారు. నాల్గవ వారం ద్విచక్ర వాహనాలు, కారులు, భారీ వాహనాలపై జీఎస్టీ తగ్గుదల అంశాలపై ప్రజలకు తెలియజేయడం చేస్తున్నారు. ప్రజలు వస్తువులను కొనుగోలు చేసే సమయంలో గతంలో ధరలు, జీఎస్టీ తగ్గిన తరవాత ధరలు గురించి వ్యాపారులను అడిగి తెలుసు కోవాలన్నారు. ప్రతీ కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లులు పొందాలని కలెక్టర్ సూచించారు.

  • Related Posts

    బాధితుల‌కు మెరుగైన వైద్యం అందించాలి

    Spread the love

    Spread the loveఆదేశించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమరావతి : రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతాలం కొండేపాడు ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీల తో…

    ఆస్ట్రేలియా హైకమిషనర్‌తో సీఎం భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క రంగాల‌లో స‌హ‌కారం పై చ‌ర్చ‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస్ట్రేలియా హై క‌మిష‌న‌ర్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి కీల‌క రంగాల‌లో స‌హ‌కారంపై చ‌ర్చించారు. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ-సాంకేతికత,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *