కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి

Spread the loveటీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు.…

newsseals-SrisailamDevasthanam
Spread the love

టీటీడీ చైర్మ‌న్ ను కోరిన శ్రీ‌శైలం ఆల‌య చైర్మ‌న్

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ చైర్మన్ శ్రీశైలం దేవస్థానం చైర్మన్ కు హామీ ఇచ్చారు.

ప్ర‌తి పైసా ఖ‌ర్చు చేయాలంటే ముందుగా టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానం చేయాల్సి ఉంటుంద‌న్నారు. ఈ స‌ద‌ర్బంగా సాయం చేసేందుకు వీలు కుదురుతుంద‌న్నారు. ప్ర‌స్తుతం టీటీడీకి భారీ ఆదాయం స‌మ‌కూరుతున్నా, దేశ వ్యాప్తంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఆల‌యాల‌ను నిర్మించే ప‌నిలో ఉంద‌న్నారు ఈ సంద‌ర్బంగా టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భార‌తీయ సంస్కృతిని ప‌రిర‌క్షించేందుకు టీటీడీ కృషి చేస్తోంద‌ని చెప్పారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు శ్రీశైలం దేవస్థానం బోర్డు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports