Spread the loveఅఖండ‌-2 చిత్రం అద్భుతం : బండి సంజ‌య్ద‌ర్శ‌కుడిలో శివుడు ఆవ‌హించాడ‌ని కితాబు హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా నందమూరి బాల‌కృష్ణ న‌టించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వహించిన అఖండ -2 చిత్రం గురించి ఆకాశానికి ఎత్తేశారు. ఇలాంటి సినిమాను తాను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌న్నాడు. ఓహో ఆహా అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. అఖండ-2 సినిమా చూడకుండా.. ఇన్ని…

newsseals-BandiSanjayKumar
Spread the love

అఖండ‌-2 చిత్రం అద్భుతం : బండి సంజ‌య్
ద‌ర్శ‌కుడిలో శివుడు ఆవ‌హించాడ‌ని కితాబు

హైద‌రాబాద్ : కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా నందమూరి బాల‌కృష్ణ న‌టించిన బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వహించిన అఖండ -2 చిత్రం గురించి ఆకాశానికి ఎత్తేశారు. ఇలాంటి సినిమాను తాను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌న్నాడు. ఓహో ఆహా అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. అఖండ-2 సినిమా చూడకుండా.. ఇన్ని రోజులు నా జీవితాన్ని వృధా చేసుకున్నాన‌ని వాపోయాడు.

మిగిలిన జీవితం ధర్మానికి అర్పించాలని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఈ సినిమా నాకు ఆలోచన కలిగించిందన్నార‌. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలు కాలేజ్ స్టూడెంట్స్ బెట్టింగ్ వేసుకొని మరీ చూస్తున్నారంటూ చెప్పారు. అల‌నాటి సీనియర్ ఎన్టీఆర్ ని మైమరిపించేలా బాలకృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు. బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసుకుంటున్నామ‌ని చెప్పారు .

అఖండ 2 సినిమాలో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయ్యాడని అనిపించింద‌న్నారు. అంతే కాదు సాక్షాత్తు ఆ ఈశ్వ‌రుడే బోయపాటి శ్రీనులో ఆవహించి అఖండ సినిమా తీయించి ఉంటాడని పేర్కొన్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports